19, డిసెంబర్ 2017, మంగళవారం

జపాకుసుమాల జావళి

మా వరండా తోటలో విరబూసిన .. మందారాలతో ..ఒక చిత్రాన్ని రూపొందించాను .
చూడండి  మరి ..
ఈ చిత్రంలో వినిపించిన సంగీతం ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారంచేసే "క్రాంతిరేఖలు " కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ అని గమనించమనవి.
 ధన్యవాదములతో .. వీడియోని  చూడండి 




వీడియోని చూడండి ఈ లింక్ లో .. 

12, ఆగస్టు 2017, శనివారం

అంతస్తులలో ఆకుపచ్చ సిరి



శుభోదయం ..మిత్రులారా !
నాకు చిన్నప్పటి నుండి మొక్కల పెంపకం చాలా ఇష్టం.  ప్రస్తుతం మా వసతి గృహం 30 అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు గల తూర్పు వరండా ,24 అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పు గల ఉత్తరం వైపు వరండా నాలుగు కిటికీలు ,మూడు ద్వారాలు తెరుచుకునే స్థలంలో మూడవ అంతస్తు ఇనుప తడికెల రక్షణ వలయాల మధ్య ఒక చుక్క నీరు పడితే వినబడే కేకల మధ్య నా మొక్కల పెంపకం ఇష్టంగా సాగుతుంది. కేవలం నాలుగు గంటలు సూర్య రశ్మి సోకే ఈ వరండాలో చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్,తూర్పు వైపున నాలుగైదు ట్రే లలో ఆకు కూరలు కొన్ని పూల మొక్కలు ఇదీ నా తోట పెంపకం. చేయి విసిరితే పడి మొలిచిన దోస మొక్క పెరిగి పెద్దది కాయలనిచ్చింది. పచ్చి మిర్చి పూత దశలో ఉంది. ఇవి కాకుండా కొన్ని పూల మొక్కలు నాకు ఆహ్లాదాన్నిస్తాయి.
ఫేస్ బుక్ లో  రఘోత్తమరెడ్డి  గారి మిద్దె తోట  స్పూర్తి తో మొక్కలకి చీడ పీడలు రాకుండా, రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా ..నా బాల్కనీ తోటని కాపాడుకుంటున్నాను. 
మన ఇంటి పంట ఆరోగ్యాన్ని,మన తోట మనకి ఆహ్లాదాన్ని ఇస్తూ పచ్చదనం ప్రక్కన మనసుకి సాంత్వన కలుగుతూ ఉంటుందని నా అనుభవం. 
భవిష్యత్తులో ఓ చిన్న పొదరిల్లు, దాని చుట్టూ ఓ తోట, ఆ తోటలో నాతో పాటు తిరిగే చిట్టి చిట్టి పాదాలు ఇది నాకల. సాధ్యమైనంత వరకూ పచ్చదనంతో  సాన్నిహిత్యం శారీరక,మానసిక ఆరోగ్యానికి మంచిదని నా నమ్మికతో .. ఈ చిరు ప్రయత్నం..   


మా బాల్కనీ గార్డెన్ వీడియో తీసి .. you tube లో ఉంచాను . ఈ లింక్  అంతస్తులలో ఆకుపచ్చ సిరి  ఇక్కడ చూడవచ్చు . 

9, మార్చి 2017, గురువారం

మా ఇంటి లోపల పచ్చ ..

నగర జీవనంలో  పచ్చదనానికి ఆస్కారమే లేదని అనుకోకూడదు . మొక్కలని పెంచాలనే ఆసక్తి , ఉత్సాహం ఉండాలి కానీ పచ్చదనం మన కళ్ళ ముందు కళ కళ లాడుతుంది. అది ఎలాగంటే  విండో గార్డెన్, బాల్కనీ గార్డెన్ ,ఇండోర్ గార్డెన్ అంటూ ఉన్నాయి కదా !

అదిగో ఆ దారిలో నేను. అపార్ట్మెంట్ జీవనంలో ..అయ్యో ! ఒక మొక్క పెంచుకునే అవకాశం లేదే అని చింతించకుండా ... ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటాను. పర్యావరణ పరిరక్షణ అంటూ పెద్ద పెద్ద మాటలు వద్దు కానీ .. ప్రతి వంద చదరపుటడుగులకి కనీసం అయిదు కుండీ మొక్కలనయినా   పెంచుకుంటూ .. గృహ వాతావరణం నుండి వెలువడే విషవాయువులని ప్రారద్రోలి ..స్వచ్ఛమైన గాలిని పొందవచ్చంట అని చదివాను. ఇదిగో ఇలా ప్రయోగాత్మకంగా మాస్టర్ బెడ్ రూమ్ లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను. కొంచెం శ్రద్ద పెడితే నీడలో పెరిగే మొక్కలు ఏవేవో .. అంతర్జాలంలో చూసి తెలుసుకోవచ్చు కూడా .. 
ఇవిగో ... 10  x  14 అడుగుల విస్తీర్ణం గల గదిలో నేను అమర్చిన మొక్కలు .. 




                                                                       Spider Plant 



 
                                                                      Peace  Lily


                                                                       Golden Bostan fern


                             Golden pathos and Aralia miniature white and rhoeo  tri color plant

ఇందులో rhoeo plant మాత్రం పూర్తిగా out door plant.  ఆ plant లో మిళితమైన రంగులు చూసి ముచ్చటపడి రీడింగ్ టేబుల్ పై పెట్టుకున్నాను.

                                                                    Snake  plant

నిజానికి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడాని మట్టి కుండీలు కానీ సిరామిక్ పాత్రలు కానీ బాగుంటాయి. కానీ ఇంట్లో వాడకుండా అనవసరంగా ఉన్న పాత్రలని తీసుకుని  ఎక్కువైన నీరు బయటకి వెళ్ళే విధంగా వాటికి రంధ్రాలు వేసి ... కోకోపిట్, వర్మి కంపోస్ట్, ఇసుక, బూడిద, ఎర్రమట్టి తీసుకుని మొక్కలని నాటాను.

నిత్యం మొక్కలతో సంభాషించడం చాలా బాగుంది. ముఖ్యంగా అరచేతులతో నిమురుతూ .. తెగుళ్ళు ఏమైనా సోకినాయేమో అని పట్టి పట్టి చూసుకుంటూ .. తొందరగా పెరగాలని అతి ఆశ పడకుండా ..తగు మోతాదులో ఆర్గానిక్ ఎరువులు  వేసుకుంటూ  తగుమాత్రం నీళ్ళు అందిస్తూ .. ఎండలోకి,నీడలోకి పిల్లి పిల్లలని తిప్పినట్టు మొక్కలని తిప్పుకుంటూ .. ఇండోర్ గార్డెన్, బాల్కనీ గార్డెన్ రూపొందించుకుంటూ ఉన్నాను.



                                          నాకు చాలా నచ్చిన out door plant rhoeo  tri color plant
ఓకే... ఈ రోజుకి ఉంటాను ఫ్రెండ్స్ ..
వీలున్నపుడు  మరి కొన్ని మొక్కలని పరిచయం చేస్తాను, బై..ఫ్రెండ్స్..